సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మా ఇంటి బంగారం’.. సమంత మాస్ విశ్వరూపం చూపించనుందా?

by Pulgam srinivas |

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికెట్ లభించింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మా ఇంటి బంగారం’.. సమంత మాస్ విశ్వరూపం చూపించనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఈ సినిమాలో సమంత యాక్షన్ సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ‘U/A’ సర్టిఫికెట్ రావడంతో ఈ చిత్రంలో సమంత మాస్ అవతార్‌లో కనిపించనుందని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.




Next Story