విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

by Malleboina Mahesh |

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను స్టేట్ ఇంటర్ బోర్డు ప్రకటించింది

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల (Intermediate exams) తేదీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను స్టేట్ ఇంటర్ బోర్డు (Inter Board) ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఈ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజుల చెల్లింపుకు రేపు (నవంబర్ 1) నుంచి విద్యార్థులు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.

ఈ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు రోజుకు 2 సెషన్స్ (9AM - 12PM, 2PM-5PM) చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అలాగే 21న ఫస్టియర్, 22న సెకండియర్‌కు ENG ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ రాత పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు ఈ పరీక్షలుంటాయి. FEB 25న ఫస్టియర్, 26న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్- షెడ్యూల్

ఫిబ్రవరి 25: పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)

ఫిబ్రవరి 27: పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్ -1

మార్చి 02: మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

మార్చి 5: మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1

మార్చి 9: ఫిజిక్స్, ఎకానమిక్స్ -1

మార్చి 03: కెమిస్ట్రీ, కామర్స్

మార్చి 17: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ – 1

సెకండ్ ఇయర్ షెడ్యూల్

ఫిబ్రవరి 26: పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)

ఫిబ్రవరి 28: పార్ట్ 1 – ఇంగ్లీష్ పేపర్ -2

మార్చి 03: మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2

మార్చి 6: మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2

మార్చి 10: ఫిజిక్స్, ఎకానమిక్స్ -2

మార్చి 13: కెమిస్ట్రీ, కామర్స్ -2

మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,

మార్చి 18: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1

Next Story