- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు ( Inter students) బిగ్ అలర్ట్. ఇవాళ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు ( Inter students) బిగ్ అలర్ట్. ఇవాళ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ( Inter Supplementary Examination Results) విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు ( Inter Board). ఇంటర్ బోర్డు అధికారుల సమాచారం ప్రకారం... ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.
ఈ ఇంటర్ ఫలితాలను... ఇంటర్ బోర్డు అధికారిక సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర ప్రైవేట్ వెబ్సైట్ లో కూడా అందుబాటులో పరీక్షా ఫలితాలు ఉంటాయి. జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ లాంటి ప్రవేశాలకు ఇంటర్ మార్కులు చాలా కీలకం. అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డు.. ఇవాళ ఫలితాలను రిలీజ్ చేస్తుంది.కాగా గత నెల 22వ తేదీ నుంచి... 29వ తేదీ వరకు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 4.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ ఫలితాలలో మరోసారి ఫెయిల్ అయితే.. వచ్చే ఏడాది వరకు విద్యార్థులు ఆగాల్సి ఉంటుంది.
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.






