- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల ఆ రోజే.. అధికారిక ప్రకటన
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది. రెండోసారి వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు, మార్కుల కంప్యూటరీకరణ దాదాపుగా పూరైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది.
ఈ క్రమంలో ఇంటర్మీడియట్ ఫలితాల తేదీని తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా అధికారికంగా ప్రకటించింది. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ నెల(ఏప్రిల్) 22వ తేదీ ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పలువురు అధికారులు పాల్గొననున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.






