- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Intermidiate Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు (Telangana Inter Results) విడుదలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు (Telangana Inter Results) విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను (Result) వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ లో చూసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు 1532 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,88,413 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 5,08,582 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఈ ఏడాది కూడా ఫస్టియర్, సెకండియర్‌లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్టియర్ ఫలితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా, సెకండ్ ఇయర్‌లో 71.37 శాతం సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం పాసయ్యారు. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా, 3,33,908 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోపే ఫలితాలను వెల్లడించనుండటం విశేషం.
ఇక ఫస్టియర్ ఫలితాల్లో 81.06శాతంతో మేడ్చల్ జిల్లా, సెకండియర్‌లో 77.21 శాతంతో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వారం గడువు ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది






