విద్యార్థులకు అలర్ట్: ఈనెల 12న తెలంగాణ ఇంటర్ ఫలితాలు!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-10 11:19:39  IST  )

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల సందడి మొదలైంది.

విద్యార్థులకు అలర్ట్: ఈనెల 12న తెలంగాణ ఇంటర్ ఫలితాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల సందడి మొదలైంది. ఏప్రిల్ 12న (ఆదివారం) ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు (TGBIE) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. కాగా, తొలుత ఏప్రిల్ 11న ఫలితాలు రావచ్చని భావించినప్పటికీ, తుది ఏర్పాట్ల నేపథ్యంలో ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ల(tgbie.cgg.gov.in)తో పాటు మొబైల్ యాప్స్ ద్వారా తమ మార్కులను తెలుసుకోవచ్చు. ఫలితాల్లో ఏదైనా తేడా ఉంటే రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు ప్రత్యేకంగా గడువు ఇవ్వనుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈసారి రికార్డు స్థాయిలో వేగంగా ఫలితాలను వెల్లడిస్తుండటం విశేషం.

Next Story