- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు అందరూ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. విద్యార్థులలో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇంటర్ ఫలితాలు ఎప్పుడూ వస్తాయి.. ఎప్పుడూ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అని ఎదురు చూస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈసారి మూల్యాంకనంలో ప్రభుత్వం కొత్త విధానం అనుసరిస్తున్నారు. పరీక్షల ఫలితాలు విడుదలైన తరువాత ఫెయిల్ అయిన విద్యార్ధుల ప్రశ్నాపత్రాల్ని మరోసారి వెరిఫై చేయనున్నారు. అలాగే ఎక్కడా ఎలాంటి తప్పులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో మొత్తం వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ పూర్తి చేయనున్నారు. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 21న ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది.
ప్రతిసారి ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన తరువాత రీ వాల్యుయేషన్‌కు అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం సబ్జెక్టుకు 600 రూపాయలు అధికారులు వసూలు చేయనున్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను https://tgbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే విద్యార్థులు తమ హాల్ టికెట్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అది కాకుండా వాట్సప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.