Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?

by Disha Web Desk 3 |
Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను ఈ నెల 23వ తేదీన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 25వ తేదీన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో నెల 23 లేదా 24వ తేదీల్లో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

కాగా ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల విడుదల తేదీని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించనుందని విశ్వసనీయవర్గాల సమాచారం.

Next Story

Most Viewed