- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లీమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థుల ( Inter students) అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ( Inter Supplementary Examination Results) విడుదల అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Intermediate Advanced Supplementary Examinations Result) విడుదల అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ 67.4 శాతం మంది, సెకండ్ ఇయర్ 51.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సహా మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాశారు. దీంతో ఈసారి ఇంటర్ సప్లిమెంటరీలో విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ వంటి ప్రవేశాలకు ఇంటర్ మార్కులు కీలకం కానున్నాయి. ఇంటర్ బోర్డు అధికారిక సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






