- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదిరిక నిర్మూలనకు 'తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి'
పేదరిక నిర్మూలన లక్షంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధిని ప్రారంభింస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పేదరిక నిర్మూలన లక్షంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధిని ప్రారంభింస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అత్యంత వెనకబడిన 6 వేల కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అభాగ్యులు, నిర్భాగ్యులకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం తరుఫున ఆయా కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం(తెలంగాణ ఇన్క్లూసివ్ లైవ్లీహుడ్స్ప్రొగ్రామ్-టీజీఐఎల్పీ)పై సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యంత వెనకబడిన కుటుంబాలను, వర్గాలకు ఆర్ధిక పథంలో నిలిపేలా సమ్మిళిత జీవనోపాధి కృషి చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండేళ్లపాటు ఆయా కుటుంబాలకు అన్ని రకాల సహయ సహకారాలు అందిస్తామన్నారు. ఆదిమ జాతులు అంతరిస్తున్నాయని, వాటి పరిరక్షణ కోసం బ్రాక్ సంస్థతో కలిసి పనిచేస్తామన్నారు. ఆదిమ జాతుల ఆర్ధిక ప్రగతిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. సమగ్ర ఉపాధి అవకాశాల ద్వారా పేదల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి సుస్థిరాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రి అన్నారు. తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి పథకంలో భాగస్వాములుగా ఉన్నా బ్రాక్ ఇంటర్నేషల్, ఆఘా ఖాన్ పౌండేషన్, సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ప్రధాన్, ట్రికిల్ అప్ సంస్థలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని చెంచుపేటలో పర్యటించి చెంచుల జీవన స్థితిగతులను తెలుసుకున్న స్మ్రితి శరణ్ ను మంత్రి సీతక్క శాలువ కప్పి సన్మానించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ స్మ్రితి శరణ్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, బ్రాక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.






