TSHRC: గాంధీ ఆసుపత్రిలో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలన

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ బృందం ఇవాళ మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించింది.

TSHRC: గాంధీ ఆసుపత్రిలో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలన
X

దిశ, డైనమిక్ బ్యూరో: మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 లోని సెక్షన్‌ 12 (c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (Telangana State Human Rights Commission) బృందం ఇవాళ (గురువారం) మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని (Gandhi Hospital) గాంధీ ఆసుపత్రిని సందర్శించింది. ఈ సందర్శనలో కమిషన్‌ ఛైర్పర్సన్‌ డా. జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌, కమిషన్‌ సభ్యులు (Judicial) శివాది ప్రవీణ, (Non-Judicial) డా. బి. కిషోర్‌ (IAS Retd.) పాల్గొన్నారు. కమిషన్‌ అధికారులలో కార్యదర్శి, సీఈఓ ఏ.ఎన్‌. కాంతి వెస్లీ (IAS), డిప్యూటీ రిజిస్ట్రార్‌ -కం- PS to ఛైర్పర్సన్‌ బీవీఏ. విజయ్‌, ప్రజాసంబంధాధికారి, పరిపాలనా అధికారి (FAC)పి. శ్రీనివాస్‌రావు, డీఎస్పీ రాములు తదితరులు కూడా ఈ సందర్శనలో భాగమయ్యారు.

ఆసుపత్రికి విచ్చేసిన కమిషన్‌ బృందాన్ని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. వాణి, ఇతర వైద్యులు, చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ, ఏసీపీలు స్వాగతించారు. కమిషన్‌ బృందం మొదట ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి, విధుల్లో ఉన్న వైద్యులతో చర్చలు జరిపింది. అనంతరం జెరియాట్రిక్‌ (వయోవృద్ధుల) విభాగం, పేడియాట్రిక్‌ (పిల్లల) విభాగం, ముఖ్యంగా పేడియాట్రిక్‌ సర్జరీ విభాగం, ఇతర విభాగాలను సందర్శించి, సంబంధిత రికార్డులను పరిశీలించింది. తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఛాంబర్‌లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్‌ డా. జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ఆసుపత్రి సందర్శన ఉద్దేశ్యాన్ని వివరించారు. పరిశీలించిన విభాగాలపై వివరాలు తెలియజేసి, పేడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో జరుగుతున్న విశిష్టమైన సేవలను అభినందించారు.

Next Story