కమర్షియల్ కష్టాలు.. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ

by Naga Rani Yarlagadda |

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో హోటల్స్ యాజామాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కమర్షియల్ కష్టాలు.. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో నిన్న బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరుకోవడంతో.. దేశంలో ఇంధన లభ్యతపై ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు సంస్థలు గృహవినియోగాలకు అవసరమయ్యే సిలిండర్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. తాజాగా చమురుశుద్ధి సంస్థలపై ఎస్మాను ప్రయోగించింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకు తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. పశ్చిమాసియాలో నెలకొన్ని యుద్ధ పరిస్థితుల ప్రభావం.. మనకు గ్యాస్ సరఫరాపై ఎక్కువగా కనిపిస్తోంది.

కేంద్రం డొమెస్టిక్ సిలిండర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో.. కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడిన హోటల్స్, రెస్టారెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నై హోటల్స్ అసోసియేషన్ దీనిపై కేంద్రానికి లేఖ రాయగా.. బెంగళూరులో హోటల్స్ యాజమాన్యం పిలుపుమేరకు హోటళ్లు, రెస్టారెంట్లు సమ్మెబాట పట్టాయి. తాజాగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ కూడా అత్యవసరంగా భేటీ అయింది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హైదరాబాద్ లో 6 వేల హోటల్స్ పై ప్రభావం పడుతుండటంతో.. ఏంచేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నాయి. బెంగళూరు తరహాలో సమ్మెకు సిద్ధమయ్యేలా హోటల్స్ యాజమాన్యాలు సమాలోచనలు చేస్తున్నాయి.

Next Story