- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"అలా జరగడం అసాధ్యం".. సైబర్ నేరాలపై సీవీ ఆనంద్ ట్వీట్
హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయన్నారు సీవీ ఆనంద్. ఒకడు పోతే మరొకడు వస్తాడని, వాడు కూడా మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడని పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలను పైరసీ చేస్తూ.. ఇండస్ట్రీని బెంబేలెత్తించిన ఐబొమ్మ నిర్వాహకులు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో అతను 50 లక్షల మందికి చెందిన సమాచారాన్ని డార్క్ వెబ్ కు అమ్మినట్లుగా తేలింది. దీంతో ఐబొమ్మ వెబ్ సైట్ ను విజిట్ చేసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇకనైనా పైరసీ ఆగుతుందా? సైబర్ క్రైమ్ కు చెక్ పడుతుందా? అని తలెత్తుతున్న సందేహాలపై రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఒకడు పోతే మరొకడు వస్తాడని, వాడు కూడా మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడని పేర్కొన్నారు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల గ్యాంగ్స్ ను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు కూడా జరుగుతూనే ఉంటాయని తెలిపారు. వీటికి మన చేతిలో ఉన్న మార్గం నివారణ ఒక్కటేనని హితవు పలికారు.
ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించాలన్న కోరికలను తగ్గించుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్ పెరగడానికి ఆ కోరికే మూలకారణమని సీవీ ఆనంద్ తెలిపారు. సైబర్ స్పేస్, అకౌంట్లను సేఫ్ గా ఉంచుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఏదీ ఫ్రీగా రాదని డైరెక్టర్ రాజమౌళి చెప్పిన మాటే జీవిత సత్యమని పునరుద్ఘాటించారు.






