ఇంజనీరింగ్ కాలేజీల ఫిర్యాదులపై విచారణ : తెలంగాణ ఉన్నత విద్యా మండలి

by Muthe.Rajitha |

ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణ, అకడమిక్ ప్రమాణాలు, ఇతర అంశాలపై వచ్చిన ఆరోపణల పట్ల తెలంగాణ ఉన్నత విద్యా మండలి సీరియస్ గా పరిగణించింది.

ఇంజనీరింగ్ కాలేజీల ఫిర్యాదులపై విచారణ :  తెలంగాణ ఉన్నత విద్యా మండలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణ, అకడమిక్ ప్రమాణాలు, ఇతర అంశాలపై వచ్చిన ఆరోపణల పట్ల తెలంగాణ ఉన్నత విద్యా మండలి సీరియస్ గా పరిగణించింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) పరిధిలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కు చెందిన క్రిస్టవా జన సమితి అధ్యక్షుడు మసరం ప్రేమ్ కుమార్ పలు ఇంజనీరింగ్ కాలేజీలపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశారు.

వచ్చిన ఫిర్యాదులను గత మార్చి 17 న స్వీకరించినట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను విచారించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను టీజీసీహెచ్ఈ కోరింది. ఈ విచారణతో జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలలో పారదర్శకత, జవాబుదారీతనం మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి నివేదిక వచ్చిన తర్వాత ఉన్నత విద్యా మండలి తగు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Next Story