TG High Court: కూకట్‌పల్లి ప్లాట్ల వేలం పై హైకోర్టులో విచారణ.. ఏమైందంటే?

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్టు ప్లాట్ల వేలంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

TG High Court: కూకట్‌పల్లి ప్లాట్ల వేలం పై హైకోర్టులో విచారణ.. ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్టు ప్లాట్ల వేలంపై (Telangana High Court) తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేపీహెచ్‌బీ ఫేజ్-15 కాలనీ వాసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. లేఅవుట్‌లో 54.29 ఎకరాల స్థలంలో ఉందని, అందులో పది శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కాదా? అని కోర్టు పేర్కొంది. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. పది శాతం ఖాళీ స్థలాన్ని ఇదివరకే జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు ఏజీ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే వేలం పాటలో ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు కేటాయింపులు చేయొద్దని, లేఅవుట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని తదుపరి విచారణ వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది. తుది కేటాయింపులు చేయకూడదనే షరతుతో వేలం కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

కేపీహెచ్‌బీలో ఖాళీ ప్లాట్లకు ముగిసిన వేలం

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్టు ((KPHB Land Auction)) పశ్చిమ డివిజన్ పరిధిలోని ఖాళీ ప్లాట్ల వేలం పాట సాయంత్రం ముగిసింది. డీడీలతో కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వేలంపాటలో పాల్గొన్నారు. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85 లక్షలు.. అత్యల్పంగా రూ.1.50 లక్షలు పలికింది. హౌసింగ్ బోర్డు పరిధిలోని 24 స్థలాల్లో 23 స్థలాలకు వేలంపాట ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. కాగా, వేలం పాటను అడ్డుకుంటామని స్థానిక బీఆర్ఎస్, జనసేన, బీజేపీ నేతలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వారిని గృహనిర్బంధం చేసి.. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Next Story