తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రత్యేక బెంచీలు

by Ramesh Naini |

తెలంగాణ హైకోర్టుకు మే 7వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రత్యేక బెంచీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టుకు మే 7వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మే 7 నుంచి జూన్ 5వ తేదీ వరకు కోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతాయని హైకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. ఈ వ్యవధిలో కోర్టు సాధారణ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే, సెలవుల సమయంలో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచీలు, వెకేషన్ బెంచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ సెలవు కాలంలో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక ధర్మాసనాలు కొలువుదీరనున్నాయి. మే 14, 21, 28 తేదీలతో పాటు జూన్ 4వ తేదీన ఈ వెకేషన్ బెంచీలు అందుబాటులో ఉంటాయి. ముందస్తు బెయిల్స్, అత్యవసర స్టే ఆర్డర్స్ వంటి తక్షణ విచారణ అవసరమైన కేసులను మాత్రమే ఈ ధర్మాసనాలు విచారించనున్నాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 6వ తేదీ నుంచి హైకోర్టు తిరిగి పూర్తిస్థాయిలో సాధారణ కార్యకలాపాలను ప్రారంభించనుంది.

Next Story