జనసేనకు షాకిచ్చిన హైకోర్టు.. హౌస్ మోషన్ పిటిషన్ రిజెక్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-02 08:04:47  IST  )

హైదరాబాద్ లో జనసేన నవనిర్మాణ సభకు అనుమతివ్వాలని కోరుతూ.. హైకోర్టులోదాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

జనసేనకు షాకిచ్చిన హైకోర్టు.. హౌస్ మోషన్ పిటిషన్ రిజెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు హైదరాబాద్ లో జనసేన నవ నిర్మాణ సభ నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సభకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముందు సైబరాబాద్ పోలీసుల్ని అనుమతి కోరగా.. వారు కొన్ని కారణాలు చూపి సభకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. తెలంగాణ జనసేన నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో.. ఈ అత్యవసర పిటిషన్ ను రిజిస్ట్రీ పరిశీలించారు. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సింది కాదని, ఇందులో అంత ఇంపార్టెంట్ ఏమీ లేదని పేర్కొంటూ.. విచారణకు తిరస్కరించారు. హైకోర్టు తాజా నిర్ణయంతో జనసేన పార్టీ ఇంకా స్పందించలేదు.

హైకోర్టు నుంచి అనుమతి రాని నేపథ్యంలో సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. హౌస్ మోషన్ పిటిషన్ రిజెక్ట్ కావడంతో.. మంగళవారం ఉదయం ఎక్స్ లో చెప్పినట్లు.. సాయంత్రం 4.30-5.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Next Story