- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భర్త నపుంసకుడు, 90 లక్షల భరణం ఇప్పించండి..భార్య పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తన భర్త నపుంసకుడు అని విడాకులతో పాటు రూ.90 లక్షల భరణం చెల్లించాలని కోరిన భార్యకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: తన భర్త నపుంసకుడు అని విడాకులతో పాటు రూ.90 లక్షల భరణం చెల్లించాలని కోరిన భార్యకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ మహిళ తన భర్త రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాడని ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేసుకుని మోసం చేశాడని కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన సంసారానికి పనికి రాడని, పిల్లలు కూడా పుట్టరని డాక్టర్లు నిర్దారించినట్టు పేర్కొంది. లైంగిక సంబంధం పెట్టుకోలేడు కాబట్టి ఈ వివాహం చెల్లదని, అనారోగ్య సమస్య చెప్పుకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇది మోసపూరితమైనదని కాబట్టి శాశ్వత భరణం కింద రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
2013 డిసెంబర్‌లో తమ వివాహం జరగ్గా ఇప్పటి వరకు తమ మధ్య శోభనం జరగలేదని ఆరోపించింది. 2013లో కేరళకు హనీమూన్ వెళ్లగా, 2014లో కశ్మీర్ వెళ్లినట్టు తెలిపింది. కానీ తమ మధ్య ఏం జరగలేదని తెలిపింది. మరోవైపు ఆమె భర్త మాత్రం 2013, 2014లో హనీమూన్‌కు వెళ్లినప్పుడు శారీరకంగా కలిశామని చెప్పాడు. ఆమె చెప్పేవన్నీ అబద్దాలే అని తోసిపుచ్చాడు. తనకు తాత్కాలికంగా అనారోగ్య సమస్య వచ్చిందని కానీ చికిత్స తీసుకున్నానని కోర్టుకు వివరించాడు. రెండు హనీమూన్ లలోనే కాకుండా చాలా సందర్భంగా భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నానని తెలిపాడు. ఇరువురి వాదనలు విన్న తరవాత జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూధన్ రావులతో కూడిన ధర్మాసనం మహిళ అప్పీల్ ను తోసిపుచ్చింది. సరైన ఆధారాలు లేని కారణంగా విడాకులు ఇప్పించలేమని స్పష్టం చేసింది.






