తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత.. సంతాపం తెలిపిన న్యాయమూర్తులు

by Ramesh Naini |   (  Updated:2025-05-04 12:14:14  IST  )

తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గిరిజా ప్రియ‌ద‌ర్శిని క‌న్నుమూశారు.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత.. సంతాపం తెలిపిన న్యాయమూర్తులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : (Justice Girija Priyadarshini passes away) తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గిరిజా ప్రియ‌ద‌ర్శిని క‌న్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జ‌స్టిస్ ఆమె ఇవాళ మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రియ‌ద‌ర్శిని మృతిప‌ట్ల హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంకు చెందిన ఆమె 1995లో లాయర్‌గా ఎన్‌రోల్‌ అయ్యారు. 2008-2021 మధ్య అనేక జిల్లా కోర్టులకు జడ్జిగా సేవలు అందించారు.

2022 మార్చిలో (Telangana High Court) తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు జ‌డ్జిగా బాధ్యతలు స్వీక‌రించే ముందు రాష్ట్ర లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీగా కూడా ప‌ని చేశారు.

Next Story