సీఎం భార్యపై ఆరోపణలు.. హైకోర్టులో పవన్ ఖేరాకు బిగ్ రిలీఫ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-10 06:27:04  IST  )

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సీఎం భార్యపై ఆరోపణల కేసులో బిగ్ రిలీఫ్ లభించింది.

సీఎం భార్యపై ఆరోపణలు.. హైకోర్టులో పవన్ ఖేరాకు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రినికి భూయాన్ శర్మపై ఆయన పరువునష్టం కలిగించే ఆరోపణలు చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ వారంరోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటిలోగా సంబంధిత కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు వేయాలని పవన్ ఖేరాను ఆదేశించింది.

అసోం సీఎం భార్యకు మూడు పాస్ పోర్టులు, విదేశాల్లో ప్రకటించని ఆస్తులు చాలానే ఉన్నాయని పవన్ ఖేరా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆమె గువాహటి పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. తనకు పరువు నష్టం కలిగించేలా పవన్ ఖేరా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయనపై పరువునష్టం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి బీఎన్ఎస్ 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసేందుకు మంగళవారం ఢిల్లీలోని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. వెనుదిరిగారు. హైదరాబాద్ లో భార్య నీలిమ ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఖేరా ముంద్తు బెయిల్ కోసం పోలీసుల్ని ఆశ్రయించారు.

Next Story