దావోస్‌లో తెలంగాణ మరో సంచలనం.. రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-23 12:28:21.0  )
దావోస్‌లో తెలంగాణ మరో సంచలనం.. రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: దావోస్‌(Davos)లో తెలంగాణ మరో సంచలనం సృష్టించింది. తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబుడులు రాబోతున్నాయి. ఏకంగా రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం సాధించింది. గతేడాదితో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు.. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఈ స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. మొత్తం 16 సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈ ఒప్పందాలతో ఏకంగా 46 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. కాగా, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు(World Economic Forum conference)లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.56,300 కోట్ల విలువైన పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించగా.. గురువారం నాడు మరింత దూకుడు కనబర్చింది. హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్(Data Center) అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ(Tillman Global Holdings is a company) ముందుకొచ్చింది. రూ.15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అంతేకాదు.. అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్(Ursa Clusters Company) రాష్ట్రంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌(Artificial Data Center)ను స్థాపించనుంది.

ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.5000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. బ్లాక్‌స్టోన్(Blackstone Company) సైతం హైదరాబాద్లో డేటా సెంటర్(Data Center) ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ప్రతిపాదిత డేటా సెంటర్ రూ.4,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్‌(Cyber ​​security Protocol) అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది. ఈ పెట్టుబడులతో కలిపి మొత్తం రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులను సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆకర్షించింది. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం ఒప్పందాలు చేసుకుంది.



Next Story

Most Viewed