సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల హవా..ఎవ‌రికి ఎన్ని వ‌చ్చాయంటే ?

by velandi.Saikiran |

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2239 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గ్రామ సర్పంచ్ లుగా విజయం సాధించారు. 1186

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల హవా..ఎవ‌రికి ఎన్ని వ‌చ్చాయంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు ఉద్రిక్త వాతావరణం మధ్య జరిగింది. కొన్నిచోట్ల చిన్నపాటి గొడవలు జరగగా, మరికొన్ని స్థానాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో డ్రా ద్వారా విజేతలను ప్రకటించాల్సి వచ్చింది. ఇరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో, లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు ఎన్నికల అధికారులు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇక ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఆధిక్యం ప్రదర్శించారు.

అటు రెండో స్థానంలో గులాబీ పార్టీ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎప్పటి లాగే భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2239 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గ్రామ సర్పంచ్ లుగా విజయం సాధించారు. 1186 మంది గులాబీ పార్టీ మద్దతుదారులు విక్టరీ కొట్టారు. 268 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు విజయం సాధించారు. ఇక ఇతరులు మొత్తం 624 మంది సర్పంచ్ లుగా గెలిచారు. ఇక డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

Next Story