- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూగర్భజలాల సంరక్షణకు చర్యలు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

- తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి
- ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టి
- రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం సెక్రెటేరియట్‌లో మంత్రి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో నీటి వినియోగం పెరుగుతున్నందున నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. 2024తో పోల్చిచూసినపుడు 2025లో జలాల వినియోగం 45.93 శాతం నుండి 46.86 శాతానికి పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాల పరిమాణాలను నిరంతరం గుర్తించేందుకు వీలుగా 1,771 ఫిజోమిటర్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలు, మైనింగ్ యూనిట్లు, అపార్టుమెంట్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లకు భూగర్భ జలాల వినియోగానికి అనుమతులు ఇవ్వడం ద్వారా వినియోగ చార్జీల రూపంలో రూ.25.80 కోట్లు గడించినట్లు తెలిపారు. 2025లో రాష్ట్రంలో భూగర్భ జలాల రీచార్జ్ గణనీయంగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,771 పైజోమీటర్లు, 352 పరిశీలనా బావులు, 921 కమాండ్ ఏరియా పరిశీలన బావులు, 64 స్ట్రీమ్‌ఫ్లో చెక్‌పాయింట్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన బోర్‌వెల్‌లను తవ్వి లబ్ధిదారులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, డిప్యూటి డైరెక్టర్ పి.జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.






