తెలంగాణ ప్రజలకు అలర్ట్..LRS రాయితీ గడువు మరోసారి పెంపు!

by velandi.Saikiran |

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. LRS.. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం ( Layout Regularization Scheme) రాయ

తెలంగాణ ప్రజలకు అలర్ట్..LRS రాయితీ గడువు మరోసారి పెంపు!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. LRS.. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం ( Layout Regularization Scheme) రాయితీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. LRS రాయితీ గడువును మరోసారి పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఈ నెల చివరి వరకు అంటే మే 31వ తేదీ వరకు.. గడువును పెంచి ఊరట ఇచ్చింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వన్ టైం సెటిల్మెంట్ ( One-time settlement) ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... మొదట మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ చివరి వరకు పెంచింది. అనంతరం మే మూడో తేదీ..ఇప్పుడు మే 31వ తేదీ వరకు కూడా పెంచారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు 25% రాయితీతో చెల్లించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది.

Next Story