ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ లేబరేటరీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని నేషనల్ ట్యుబర్‌క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ), సీనియర్ ట్రీట్‌మెంట్ లాబొరేటరీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.

ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ లేబరేటరీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
X
  • రాష్ట్రవ్యాప్తంగా 140 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్న ఎన్.హెచ్ఎం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్.హెచ్ఎం) పరిధిలోని నేషనల్ ట్యుబర్‌క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్.టి.ఇ.పి.) కింద ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ), సీనియర్ ట్రీట్‌మెంట్ లాబొరేటరీ సూపర్‌వైజర్ (ఎస్టీఎల్ఎస్) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, ఎన్.హెచ్ఎం డైరెక్టర్ డా. ఎస్. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 140 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వీటిలో 89 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 51 ఎస్టీఎల్ఎస్ పోస్టులు ఉన్నాయి. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ నియామక ప్రక్రియను చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలో నిబంధనల ప్రకారం ఈ భర్తీ ప్రక్రియ కొనసాగనుంది.

Next Story