8 మందికి గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు

by Muthe.Rajitha |

గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం ప్రకటించింది.

8 మందికి గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు
X

దిశ, హైదరాబాద్‌ : గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన 8 మంది జాబితాను సోమవారం వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ నెల 26న తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు ఇవ్వనున్నట్టు సోమవారం రాజ్గ​ భవ న్​ ​లో నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మనాభయ్య లు తెలిపారు.

ఈ అవార్డులకు గత నవంబర్ 2024 లో దరఖాస్తులు స్వీకరించగా అందులో నాలుగు విభాగాల్లో మొత్తం 594 దరఖాస్తులు వచ్చాయి. 331 ఎంట్రీలు పట్టణ ప్రాంతాల నుంచి రాగా, 263 నామినేషన్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయి. ఇందులో 356 మంది పురుషులు ధరఖాస్తు చేసుకోగా, 96 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ దరఖాస్తు చేసుకున్నారు. మాజీ కేంద్ర హోం కార్యదర్శి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, కె. పద్మనాభయ్య నేతృత్వంలోని కమిటీ అవార్డులకు వివిధ రంగాల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ఎంపిక చేస్తుంది.

జ్యూరీలో పర్యావరణ కార్యకర్త అనిల్ కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, న్యాయవాది డాక్టర్. పి. హనుమంత రావు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ లెజెండ్, కోచ్ డా. పుల్లెల గోపిచంద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కూచిపూడి నృత్య నిపుణులు డాక్టర్ పద్మజా రెడ్డి ఉన్నారు. ఈ అవార్డులు ఆయా రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి అందజేస్తారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులు అందించడంతో పాటు, అవార్డు కింద రూ. 2 లక్షలు నగదు పురస్కారం, జ్ఞాపిక అందజేయన్నారు. అవార్డుకు ఎంపికైన వారిలో దుశర్ల సత్యనారాయణ( పర్యావరణ పరిరక్షణ), అరికపూడి రఘు(దివ్యాంగుల సంక్షేమం), పారా ఒలింపిక్‌ విజేత జీవాంజి దీప్తి(క్రీడలు), ప్రొఫెసర్‌ ఎం. పాండురంగా రావు, పి.బి. కృష్ణ భారతికి సంయుక్తంగా(సంస్క్రతి), ఉన్నారు. అలాగే సంస్ధల విభాగంలో ధ్రువాంశు ఆర్గనైజేషన్‌(పర్యావరణ పరిరక్షణ), ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి(దివ్యాంగుల సంక్షేమం), ఆదిత్య మెహతా ఫౌండేషన్‌(క్రీడలు), సంస్కృతి ఫౌండేషన్ (సంస్కృతి) లకు అవార్డులను అందజేయనున్నారు.

Next Story