- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ SLP.. రేపు సుప్రీంకోర్టులో విచారణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (BC) రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ సర్కార్ (Telangana Government) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (BC) రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ సర్కార్ (Telangana Government) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు (High Court) స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇటీవల హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (Special Leave Petition) దాఖలు చేసింది.
అయితే, ఆ పిటిషన్ తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో లిస్ట్ అవ్వడంతో రేపు ధర్మాసనం ఎదుటకు విచారణకు రానుంది. కాగా, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని సుప్రీంకోర్టే చెప్పిందంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫు లాయర్లు వాదిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశాలను కూడా స్పెషల్ లీవ్ పిటిషన్‌లో కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై యావత్ తెలంగాణ ప్రజలతో పాటు బీసీ సంఘాల నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.






