- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ENC అడ్మిన్‌గా రమేష్ బాబు నియామకం
తెలంగాణ సర్కార్ (Telangana) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ (Telangana) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్)గా ఓ.వి రమేశ్ బాబు (OV Ramesh Babu) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సూర్యాపేట, ఖమ్మం చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా (Rahul Bojja) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) గ్రౌటింగ్‌కు సంబంధించి ఈఎన్సీగా అనీల్ కుమార్ ఇటీవలే కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను ఈఎన్సీ పదవి నుంచి తప్పి్స్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ కేటాయించకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆర్డర్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈఎన్సీ పోస్ట్ ఖాళీగా ఉండటంతో ఆ స్థానంలో సూర్యాపేట, ఖమ్మం చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ.వి రమేశ్ బాబుకు ఈఎన్సీగా అదనపు బాధ్యతలను కట్టబెట్టారు.






