వన్యప్రాణుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

by velandi.Saikiran |

వన్యప్రాణుల సంరక్షణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడవి ప్రాంతాలలో వేటను అరికట్టేలా

వన్యప్రాణుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వన్యప్రాణుల సంరక్షణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడవి ప్రాంతాలలో వేటను అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా 150 స్పెషల్ టీమ్స్.. ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

వేటగాళ్ల నుంచి జంతువులను రక్షించడంతోపాటు వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేలా ఈ బృందాలు పనిచేస్తాయి. జంతువుల రాకపోకలను.. పసిగట్టేందుకు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 242 ట్రాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు... రాజాగా ప్రకటన విడుదలైంది.

వాటి దాహార్తి తీర్చడానికి మొత్తం 449 సోలార్ బోర్ వెల్స్ అమర్చబోతున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో... వన్యప్రాణులకు చాలావరకు మేలు జరుగుతుంది.

Next Story