- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వేములవాడలో ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు
by Kema Shiva Kumar |
వేద పండితులు, అర్చకుల సూచనల మేరకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎల్ఈడీ స్క్రీన్లపై తాత్కాలిక దర్శన సేవలు అందించనున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: వేద పండితులు, అర్చకుల సూచనల మేరకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎల్ఈడీ స్క్రీన్లపై తాత్కాలిక దర్శన సేవలు అందించనున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. ఆలయ విస్తరణ, నిర్మాణ పనుల నేపథ్యంలో భక్తుల అభిష్టానికి అనుగుణంగా ఎల్ఈడీ స్క్రీన్లపై తాత్కాలిక దర్శనం ఏర్పాట్లు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఆర్జిత సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 2026 జనవరిలో నిర్వహించనున్న మేడారం జాతరను సందర్శించే సమ్మక్క-సారలమ్మ జాతర భక్తులకు తాత్కాలిక ఏర్పాట్లతో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధాన ఆలయం నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తుల సౌకర్యం కోసం ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని శైలజా రామయ్యర్ పేర్కొన్నారు.
Next Story






