- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నెలలో రెండు సార్లు కేబినెట్ భేటీ
by Kema Shiva Kumar |
పాలనాపరమైన అంశాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన అంశాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతినెలా రెండు సార్లు కేబినెట్ సమావేశం (Cabinet Meeting) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి నెల మొదటి, మూడో శనివారం మంత్రివర్గ భేటీ ఏర్పాట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచనాప్రాయంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల (Welfare Schemes) అమలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా ఆ సమావేశాల్లో శాఖ వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. విధాన పరమైన నిర్ణయాల్లో వచ్చిన గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేసేందుకే నెలలో రెండు సార్లు కేబినెట్ భేటీకి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Next Story






