- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మరో రెండు కాఫ్ సిరప్‌లపై నిషేధం
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ‘కోల్డ్‌రిఫ్’ కఫ్ సిరప్ సేవించిన కారణంగా 11 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ‘కోల్డ్‌రిఫ్’ కాఫ్ సిరప్ సేవించిన కారణంగా 11 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) కలుషితం ఉన్న SR-13 బ్యాచ్ సిరప్‌ను ఉపయోగించవద్దని డీసీఏ అడ్వైజరీ చేసింది. రాష్ట్రంలోని మెడికల్ స్టోర్‌లు ఆసుపత్రులలో ఆ బ్యాచ్ సిరప్‌లను సీజ్ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో రెండు కాఫ్ సిరప్‌లపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యాన్‌కు గురైన కాఫ్ సిరప్‌లలో రీలైఫ్, రెస్పిఫ్రెష్-TR సిరప్‌లు ఉన్నాయి. అయితే, ఈ రెండు దగ్గు మందులను మెడికల్ స్టోర్‌లలో ఎవరూ విక్రయించొద్దంటూ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.






