తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సోలార్‌ కారు పార్కింగ్ కానోపీ ఏర్పాటుకు ఆమోదం

by Kema Shiva Kumar |

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సోలార్‌ కారు పార్కింగ్ కానోపీ ఏర్పాటుకు ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయ ప్రాంగణంలో సోలార్ ఎనర్జీతో నడిచే కారు పార్కింగ్ కానోపీనీ నిర్మించే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దాని విలువ సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సచివాలయ ప్రాంగణంలోని నైరుతి, వాయువ్య విభాగాల్లో వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని కవర్ చేసే సోలార్-ప్యానెల్ పైకప్పు నిర్మాణంతో బహుళ-స్థాయి పార్కింగ్ (G+2) సౌకర్యంతో కానోపీ రూపుదిద్దుకోనుంది. పునరుత్పాదక శక్తితో పాటు మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం, సిబ్బంది, సందర్శకులకు పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడం, వేసవిలో వేడి ప్రభావాన్ని తగ్గించడం, పరిపాలనా సముదాయంలో భూ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే, తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO), రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. భవిష్యత్తు విస్తరణ, డ్రైవర్ల విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలను కూడా ఈ కానోపీ అందించనుంది.

Next Story