TG: వాహనదారులకు BIG అలర్ట్.. నెంబర్ ప్లేట్ల విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-10 07:40:19  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసింది.

TG: వాహనదారులకు BIG అలర్ట్.. నెంబర్ ప్లేట్ల విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రరైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్లు ప్లేట్లు(High-Security Number Plates) లేకపోతే బండి సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. నెంబర్ ప్లేట్ల కోసం https://www.siam.in/ వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకోవాలని పేర్కొన్నది. వచ్చే సెప్టెంబర్ 30వ తేదీవరకు గడువు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాతే కేసులు నమోదు చేయడం, బండి సీజ్ చేయడం వంటివి చేస్తామని రవాణాశాఖ(Transport Department) స్పష్టం చేసింది. ఇన్యూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిబంధనలు విధించింది.

Next Story