- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay : తెలంగాణ ప్రభుత్వానిది తప్పుల తడక కులగణన : బండి సంజయ్
దేశంలో కులగణన(Cast Census) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కులగణన(Cast Census) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ(PM Narendra Modi) చెప్పిన సామాజిక న్యాయం చేతల్లో చూపిస్తున్నారని పేర్కొన్నారు. దేశ జనాభా లెక్కలతోపాటు, కులగణన కూడా చేయాలని తీసుకున్న నిర్ణయంతో వెనుకబడిన వర్గాల వారికి సమానత్వం దక్కుతుందని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కులగణనకు పూర్తి వ్యతిరేకం అని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపట్టకపోవడమే అందుకు పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పులతడక అని, అది మేము అంటున్న మాట కాదని, ఆ పార్టీ వారే బహిరంగంగా లెక్కలతో సహ చూపిస్తున్నారని విమర్శించారు. కేంద్రప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా కులగణన చేపడుతుందని, దీంతో కులాల వారీగా దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు తెలుస్తాయని అన్నారు. తాము చేపట్టబోయే లెక్కల ఆధారంగా రిజర్వేషన్లలో న్యాయం జరుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.






