TG News : ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2న తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

by Muthe.Rajitha |

తెలంగాణ(Telangana) కాంగ్రెస్ సర్కార్(Congress Govt) ప్రభుత్వ ఉద్యోగులకు(Govt Employees) భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం.

TG News : ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2న తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) కాంగ్రెస్ సర్కార్(Congress Govt) ప్రభుత్వ ఉద్యోగులకు(Govt Employees) భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Farmation Day) ఉద్యోగులపై వరాల జల్లు కురువబోతునట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలలో ఒకటి ఆరోజు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేయబోతున్నారని అధికారులు చెబుతున్నారు. అలాగే ఇతర బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించనున్నారని పేర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ ఆరోగ్య పథకాన్ని ప్రకటిస్తారని కూడా ప్రచారం నడుస్తోంది.

కాగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యి వారి వినతులను పరిశీలించారు. వీటిలో కొన్ని డిమాండ్లకు కమిటీ అంగీకరించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. రేపో మాపో సీఎం రేవంత్ రెడ్డితో కమిటీ సమావేశం అయి వారి నివేదికను అందిస్తుందని తెలుస్తోంది. రేవంత్ ఆమోదం అనంతరం సీఎస్ రామకృష్ణారావు అధికారిక ప్రకటన చేయనున్నారని ఉద్యోగ సంఘాల సమాచారం.

Next Story