- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్త పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. త్వరలో కీలక ప్రకటన
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ దారులకు గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం(Telangana government) కొత్త పింఛన్ దారుల(Telangana government)కు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా త్వరలో కసరత్తులు ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం 11 రకాల పింఛన్లు అందిస్తోంది. మొత్తం 42 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పింఛన్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. పింఛన్ తీసుకుని చనిపోయిన వాళ్ల స్థానంలో కొత్త వారిని చేర్చే అంశంపైనా ఆలోచన చేస్తోంది.
కాగా త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అర్హులను త్వరగా ఎంపిక చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. బడ్జెట్‌లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. కొత్త పింఛన్ల ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖకు త్వరలో పంపనున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. ఈ మేరకు కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అటు అధికారులు సైతం కసరత్తుల చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!






