TG Govt: పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

by Prasad Jukanti |   (  Updated:2025-06-28 10:45:57  IST  )

పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

TG Govt: పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంకను టీజీఐఐసీఈ వీసీ, ఎండీగా, టూరిజం శాఖ ఎండీ వల్లూరి క్రాంతిని గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్‌గా, సెర్ప్ అడిషనల్ సీఈఓ కాత్యాయనీ దేవికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఖమ్మం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మహేందర్‌రెడ్డిని ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది డీఎస్పీలు, హైదరాబాద్ జంటనగరాల్లో భారీగా ఏసీపీలను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది.

Next Story