- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ప్రధాని మోదీ : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో డిసెంబర్ 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సమ్మిట్ పై బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రుల్ని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలో డిసెంబర్ 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సమ్మిట్ పై బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నత అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే లిస్ట్ రెడీ చేయాలని అధికారులకు సూచించారు. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపినట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేసే స్టాల్స్ డిజైన్లను చూపించారు. పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. విభాగాల వారిగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను కూడా రెడీ చేయాలని, వారికి ఇచ్చే సమయాన్ని ముందే ఫిక్స్ చేసి ప్రోగ్రామింగ్ చేయాలని సూచించారు. సమ్మిట్ లో జరిగే ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాళ్ల ఏర్పాటులో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.






