మహిళా ఉద్యోగుల రక్షణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by Ramesh Naini |   (  Updated:2026-04-10 10:17:47  IST  )

మహిళా ఉద్యోగుల రక్షణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

మహిళా ఉద్యోగుల రక్షణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మహిళా ఉద్యోగుల రక్షణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act-2013) అమలులో భాగంగా.. తెలంగాణ సచివాలయ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వి.డి. సుధారాణి (ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి), సభ్యులుగా జి. శైలజ (సహాయ కార్యదర్శి), టి. లక్ష్మీ ప్రసన్న (సెక్షన్ ఆఫీసర్), ఆయేషా తబస్సుమ్ (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)లను సైతం నియమించారు.

కమిటీ ప్రధాన విధులు..

జీఏడీలో పనిచేసే మహిళా ఉద్యోగుల నుంచి వచ్చే లైంగిక వేధింపుల ఫిర్యాదులను ఈ కమిటీ స్వీకరిస్తుంది. వాటిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను అందజేస్తుంది.

Next Story