- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయంపై తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయంపై తీసుకుంది. నేడు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందని వెల్లడించారు.
సవరించిన ప్రణాళిక వల్ల ప్రాజెక్టు వ్యయం దాదాపు 10 నుండి 12 శాతం వరకు తగ్గుతుందని మంత్రి తెలియజేశారు. భూసేకరణ కూడా దాదాపు సగానికి తగ్గుతుందని, మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు రూ.1,500 నుంచి 1,600 కోట్ల వరకు ఆదా చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.






