తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-18 16:14:04  IST  )

తెలంగాణ ప్రభుత్వం 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ, పాలనాపరమైన అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రధానంగా ఏఎస్పీ స్థాయి అధికారులను వివిధ జిల్లాల్లో అదనపు ఎస్పీలుగా (Addl. SP) నియమించడం గమనార్హం.

ఈ బదిలీల్లో భాగంగా, అసిఫాబాద్ ఏఎస్పీగా ఉన్న ఎస్.చిత్తరంజన్‌ను అదే జిల్లాకు అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు. కామారెడ్డి ఏఎస్పీగా ఉన్న బొక్క చైతన్య రెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీగా, జనగామ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పందేరే చేతన్ నితిన్‌ను జగిత్యాల అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌ను మెదక్ అదనపు ఎస్పీగా, వరంగల్ ఏఎస్పీగా ఉన్న నగ్రాలె శుభమ్ ప్రకాష్‌ను నిజామాబాద్ అదనపు డీసీపీగా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా భైంసా అదనపు ఎస్పీ రాజేష్ మీనాను వనపర్తి అదనపు ఎస్పీగా, ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా ఉన్న పి.మౌనికను అదే జిల్లాకు అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. నిర్మల్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పాతిపాక సాయికిరణ్‌ను భైంసా ఎస్డీపీఓగా, వేములవాడ ఏఎస్పీగా ఉన్న రుత్విక్ సాయి కొట్టేను ఉట్నూరు ఎస్డీపీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాలని సీఎస్ ఆదేశించారు.

Next Story