CM Revanth Reddy : సింగపూర్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ(Telangana) అభివృద్ధికి విదేశీ పెట్టుబడుల(Foreign Investment) సాధన ప్రధాన ఎజెండాగా సింగపూర్(Singapore)పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం కీలక ఒప్పందం(Crucial Agreement) కుదుర్చుకుంది.

CM Revanth Reddy : సింగపూర్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) అభివృద్ధికి విదేశీ పెట్టుబడుల(Foreign Investment) సాధన ప్రధాన ఎజెండాగా సింగపూర్(Singapore)పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం కీలక ఒప్పందం(Crucial Agreement) కుదుర్చుకుంది. తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ITES), సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University) మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ), యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITES)ను సందర్శించారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో రేవంత్ రెడ్డి సంభాషించారు.

ఐటీఈ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో ఐటీఈ అధికారులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ వీఎల్ వీఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకడమిక్, అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్, ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్, జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది.

Next Story