- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Capitaland-TG Govt: కొత్త ఐటీ పార్క్.. సింగపూర్‌తో తెలంగాణ సర్కార్ మరో భారీ ఎంవోయూ
సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం సింగపూర్ (Singapore) పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. (New IT park) కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టెందుకు క్యాపిటాల్యాండ్ (Capitaland) కంపెనీతో తెలంగాణ సర్కార్ (Telangana government) ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ గ్రూప్ నేతృత్వంలో హైదరాబాద్‌లో ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ అభివృద్ధికి ముందడుగు పడింది. ఇక తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం మరో విజయాన్ని సాధించిందని పంచుకోవడానికి సంతోషంగా ఉందని తెలంగాణ సీఎంవో ఆదివారం ఎక్స్ వేదికగా ఈ వివరాలను ప్రకటించింది. క్యాపిటాల్యాండ్ గ్రూప్ హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ. 450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఇది చాలా కొత్త ఉద్యోగ అవకాశాలను తెస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్లు ప్రకటన చేసింది.






