ఏపీకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-16 09:12:02  IST  )

గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి దాదాపు 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్‌ ద్వారా నల్లమలసాగర్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం పొలవరం-నల్లమల సాగర్ (Polavaram-Nallamala Sagar) ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

ఏపీకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి దాదాపు 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్‌ ద్వారా నల్లమలసాగర్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం పొలవరం-నల్లమల సాగర్ (Polavaram-Nallamala Sagar) ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రాజెక్టు డీపీఆర్ (DPR) తయారీకి టెండర్లను ఇటీవల విడుదల చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ తాజాగా పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) ఈ కేసును వాదిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పొలవరం-బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు అభిషేక్ మను సింఘ్వీతో భేటీ అయి కోర్టులో లేవనెత్తాల్సిన అభియోగాలపై చర్చించారు.

Next Story