BREAKING: పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-24 13:21:12  IST  )

పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

BREAKING: పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ మేరకు వివరాలను సమర్పించింది. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశామని పేర్కొంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను ఎన్నికల సంఘానికి పంపింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లతో పాటు.. లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. కాగా.. నేడు హైకోర్టులో స్థానిక ఎన్నికల పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా.. ప్రధాన జడ్జి సెలవులో ఉండటంతో రేపటికి విచారణ వాయిదా పడింది. ఈ విచారణ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. 12,733 పంచాయతీల్లో ఉన్న 1,12,288 వార్డుల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

Next Story