- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతిరోజూ పాతికవేల మందికి రూ.5కే ఇందిరమ్మ టిఫిన్స్.. మెనూ ఇదే !
గ్రేటర్ హైదరాబాద్‌లోని 60 ఇందిరా క్యాంటీన్లలో అల్పాహారం, మిల్లెట్ టిఫిన్ పెట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని 60 ఇందిరా క్యాంటీన్లలో అల్పాహారం, మిల్లెట్ టిఫిన్ పెట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 150 కేంద్రాలకుగాను మొదటి దశలో 60 కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి కసరత్తు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వ గానే ప్రారంభించే అవకాశముంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూ.5 భోజన కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇందిరా క్యాంటీన్లలో టిఫిన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నగరంలోని చిరు వ్యాపారులు, అడ్డా కూలీలు, నగరానికి వివిధ పనులపై వచ్చే వారికి తక్కువ ధరలో భోజనం అం దుబాటులో ఉండేలా 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 భోజన పథకాన్ని మొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించింది. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, అడ్డా కూలీలు ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తు తం నగరంలో 150 కేంద్రాల్లో ప్రతి రోజూ సుమారు 30 వేల మంది భోజనం చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కోట్ల మందికి భోజనం అందించారు. 150 కేంద్రాలకుగాను ప్రస్తుతం 128 కేంద్రాల్లో మాత్రమే భోజనం అందిస్తున్నా రు. మిగిలిన కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా నిలిపేశారు.
రూ.5 కే భోజన పథకం
జీహెచ్ఎంసీ పరిధిలో అందిస్తున్న రూ.5 భోజనంలో 400 గ్రాముల రైస్, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల సబ్జీ, 15 గ్రాముల పికిల్ అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి రూ.27.63 ఖర్చు చేస్తున్నారు. దీనిలో రూ.5 లబ్ధిదారులు చెల్లిస్తుండగా మిగిలిన రూ.24.83లను జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఈ పథకానికి ప్రతి ఏటా జీహెచ్ఎంసీ సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తోంది. పదేండ్ల కాలంలో సుమారు రూ.247 కోట్లు ఖర్చు చేయడంతోపాటు 12 కోట్లకుపైగా మందికి భోజనాలు అందిం చారు. రూ.5 భోజనానికి సంబంధించిన రేటును త్వరలో నే రూ.29.83కు పెంచనున్నారు.
60 కేంద్రాల్లో రెడీ
ఇందిరా క్యాంటీన్లలో ఇక నుంచి అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించనున్నారు. 60 ప్రాంతాల్లో టిఫిన్ పథకా న్ని ప్రారంభించడానికి అధికారులు రెడీ చేశారు. ఉదయం టిఫిన్లలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, మైసూ ర్ బజ్జీ, పూరీలు, పొంగల్ అందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టిఫిన్‌ను ప్రజలకు రూ.5లకే అందించాలని బల్దియా నిర్ణయించింది. ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం మొత్తం 19 రూపాయలు ఖర్చు చేయా లని నిర్ణయించారు. దీనిలో జీహెచ్ఎంసీ వాటాగా రూ. 14 చెల్లించాల్సి ఉంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు అందించేందుకు హరేకృష్ణా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతి రోజూ 25 వేల మందికి టిఫిన్స్ అందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.






