- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. రేపు ప్రత్యేక సెలవు
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక ప్రకటన జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక ప్రకటన జారీ చేసింది. రేపు గిరిజనులకు ప్రత్యేక సెలవు(Special Holiday) మంజూరు చేసింది. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్(Sevalal Maharaj) జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని బంజారా గిరిజన ఉద్యోగులకు రేపు ప్రత్యేక క్యాజువల్ లీవ్(Casual Leave for Tribels) ఇస్తున్నట్టు ఆదేశాలు చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని బంజారా ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS ShanthiKumari) ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గతంలో బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నపుడు సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించింది. ఇప్పుడు కూడా సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి వినతులు పంపించారు. ఈ క్రమంలో సేవాలాల్ జయంతిని పబ్లిక్ హాలిడేగా కాకుండా కేవలం క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. పబ్లిక్ హాలిడే ఇవ్వకుండా క్యాజువల్ లీవ్ ఇవ్వడం పట్ల, అందునా కేవలం బంజారా గిరిజనులకు మాత్రమే ఇవ్వడం పట్ల గిరిజన సంఘాలు మండి పడుతున్నాయి.






