- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్వాక్రా మహిళలకు త్వరలో వడ్దీలేని రుణాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్వాక్రా మహిళలకు త్వరలో వడ్దీలేని రుణాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. చాలా కాలం నుంచి జీతాలు రావడం లేదని ఆశా వర్కర్లు విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వారికి జీతాలు అందేలా చూస్తానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అంతేకాదు.. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, రెండో ఏఎన్‌ఎంల వంటి వారికి ప్రతి నెల 1వ తేదీన బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.






