- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఆ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు (Anganwadi Teachers), హెల్పర్ల (Angan wadi helpers) ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ మేరకు ఇవాళ సంబంధిత ఫైల్‌పై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. 6,399 అంగన్‌వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీటిని ఆయా జిల్లా కలెక్టర్లే జారీ చేయనున్నారు. అయితే, తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం తొలిసారి. ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్‌వాడీలు పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.






